అర్హులా.. అనర్హులా!
అప్పట్లో సొంత ఇల్లు ఉన్న వారు కూడా డబుల్ బెడ్ రూం కోసం దరఖాస్తు చేసుకున్నారు. డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయగా, సొంత ఇల్లు ఉన్న పలువురికి డ్రాలో ఇల్లు వచ్చింది. దానిపై ఫిర్యాదులు రావడంతో గతంలో కొందరివి రద్దు చేశారు. ఆ రద్దు చేసిన ఇళ్లను ఎలాంటి విచారణ లేకుండా బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అధికారులు ఇళ్లకు ఎంపికై న వారు అర్హులా.. కాదా.. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూం రెండింటికీ ఎంపిక అయ్యారా అనే సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు.
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులను మున్సిపల్ సిబ్బంది సర్వే చేస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొందరు సొంతిల్లు ఉన్న వారు కూడా ఉన్నారనే ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో మున్సిపల్ సిబ్బంది సంబంధిత లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇల్లుకు రెండింటికి ఎంపిక అయితే వాటిలో ఒకటి రద్దు చేస్తున్నారు. ఇల్లు లేని పేద వారికి మాత్రమే డబుల్ బెడ్ రూం ఇవ్వాలని మంత్రి ఆదేశించడంతో వాస్తవాలను తెలుసుకోవాలన్న క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కగా సర్వే చేశాక లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించే అవకాశం ఉంది.
నీలగిరిలో 554 డబుల్ బెడ్‌రూం ఇళ్లు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీలగిరి పట్టణంలోని కలెక్టరేట్ వెనుక, పెద్దబండ సమీపంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించింది. రెండు చోట్లా కలిపి మొత్తం 554 ఇళ్లు ఉన్నాయి. వాటిలో అంతర్గత పనులు చేపట్టకుండానే లబ్ధిదారులను ఎంపిక చేసింది. కానీ లబ్ధిదారులకు కేటాయించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి కోమటిరెడ్డి నిధులు మంజూరు చేయించి కరెంట్, డ్రెయినేజీ, సెప్టిక్ ట్యాంక్ తదితర పనులను ఇటీవల పూర్తి చేయించారు.
ఫ నీలగిరిలో డబుల్ బెడ్‌రూం లబ్ధిదారుల సర్వే
ఫ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న సిబ్బంది
ఫ ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్‌రూం రెండూ వస్తే.. ఒకటి రద్దు


