నల్లగొండ : గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తాను ఎల్లవేళలా సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటో గ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న ఎన్‌పీఎల్–6 క్రీడల పోస్టర్‌ను హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో బుధవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. టోర్నమెంట్‌కు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. క్రీడాకారులంతా ఈ టోర్నమెంట్‌లో పాల్గొని రాణించాలన్నారు. మొదటి బహుమతి రూ.2,22,222, రెండో బహుమతి రూ.1,11,111 అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని రమేష్‌గౌడ్, ఆంగోతు ప్రదీప్‌నాయక్, కేసాని వేణుగోపాల్‌రెడ్డి, నిర్వాహకులు బోనగిరి ప్రభాకర్, ముత్తినేని నాగేశ్వరరావు, పాలకూరి శ్రీధర్, గంజి గిరి, కోమటిరెడ్డి, శేఖర్‌రెడ్డి, సాయి, చిన్ని రంగ, మధు, నవీన్‌రెడ్డి, నాని పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


