పేదల పక్షాన సమరశీల పోరాటం
నల్లగొండ టౌన్ : పేదల పక్షాన సమరశీల పోరాటాలు నడిపింది సీపీఐ మాత్రమేనని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 26 ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని చేపట్టిన ప్రచార జాతా బుధవారం రాత్రి నల్లగొంగకు చేరుకుంది. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని మొట్టమొదటగా గర్జించిన పార్టీ సీపీఐ అన్నారు. బీజేపీ ఏరోజు కూడా దేశం కోసం పోరాడలేదు అని, ఏ ఒక్క నాయకుడు కూడా జైలుకు వెళ్లలేదన్నారు. కానీ, దేశభక్తి పేరుతో ఓట్లు అడుగుతోందని విమర్శించారు. అంతకు ముందు మర్రిగూడ బైపాస్ నుంచి గడియారం సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల నర్సింహ, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్దె శ్రీనివాస్, నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, పబ్బు వీరస్వామి, బొల్గూరి నర్సింహ, గురిజ రామచంద్రం, తిర్పాటి వెంకటేశ్వర్లు, కేఎస్.రెడ్డి, చాపల శ్రీను, ఎండీ.అక్బర్, సురిగి చలపతి, బొడిగె సైదులు, జగన్, గణేష్‌నాయక్, యాదయ్య, ముండ్ల ముత్యాలు, కోమటిరెడ్డి ప్రద్యుమ్నారెడి్‌డ్ తదితరులు పాల్గొన్నారు.


