చిత్తడి నేలల గుర్తింపు పూర్తి చేయాలి
నల్లగొండ : సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నల్లగొండ జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం నల్లగొండలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలల గుర్తింపును పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ సూచనల మేరకు చిత్తడి నేలల సర్వే, నిర్ధారణ, నోటిఫికేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగరాజు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.


