రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. కమీషన్లకు కక్కుర్తి పడి రైతులను మోసం చేస్తోందని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం ఆయన నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు కమీషన్లకు కక్కుర్తి పడి బస్తాకు 2,3 కేజీల చొప్పున కట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.2800 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతుబంధు ఇవ్వడం లేదని, రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదన్నారు. వర్షాలకు నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి పేరు వస్తుందనే.. పసల్ బీమాను అమలు చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, నాయకులు పిల్లి రామరాజు, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పోతేపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, పకీర్ మోహన్‌రెడ్డి, సురకంటి రంగారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, గడ్డం వెంకట్‌రెడ్డి, గడ్డం మహేష్, మిర్యాల వెంకటేశం, జగ్జీవన్‌రామ్, ఓరుగంటి వంశీ, పిండి పాపిరెడ్డి, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ శాసనసభా పక్షనేత
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం


