స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా అరుణప్రియ
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా అరుణప్రియను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ అలువాల రవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అరుణప్రియ ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఏడాది పాటు ఆమె స్టూడెంట్ అఫైర్స్ డెరెక్టర్‌గా సేవలందించనున్నారు.
ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి
చిట్యాల : రైతులంతా ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల్లో పంటలను పండిస్తే ప్రభుత్వం నుంచి అని విధాలుగా మద్దతు ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ) పి.శ్రవణ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం చిట్యాల మండలం గుండ్రాంపల్లిలోని కవిత, కృష్ణ సాగు చేస్తున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలను పండించే వారంతా సంఘంగా ఏర్పడితే ప్రభుత్వం పలు రకాల సబ్సిడీలను అందిస్తుందన్నారు. వరి పండించే రైతులంతా యాసంగిలో తమ భూముల్లో జింక్ సల్పేట్ రెండు గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ పగిడిమర్రి గిరిబాబు, ఏఈఓ మీనాకుమారి, రైతులు పాల్గొన్నారు.
బీఎస్పీ జిల్లా
అధ్యక్షుడిగా రవిశంకర్
నల్లగొండ టూటౌన్ : బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నల్లగొండకు చెందిన రావులపాటి రవిశంకర్‌ను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాంశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నియామకపత్రం అందుకున్న సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మామావతి ఆధ్వర్యంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు
శాలిగౌరారం : సీసీఐ ఆధ్వర్యంలో బుధవారం నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా కొనసాగనున్నట్లు శాలిగౌరారం మార్కెట్ కార్యదర్శి చీనానాయక్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని మాధారంకలాన్ వద్ద గల కాటన్‌మిల్లులో పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయన్నారు.
సైనిక స్కూల్ ఏర్పాటుకు సాగర్ గురుకులం పరిశీలన
నాగార్జునసాగర్ : సైనిక స్కూల్ ప్రతిపాదనలో భాగంగా మంగళవారం స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను సైనిక్ స్కూల్ ప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించింది. రాష్ట్ర వ్యాప్తంగా సొంత భవనాలు కలిగిన 21 గురుకుల పాఠశాలలను సైనిక స్కూల్స్‌గా మార్చాలనే లక్ష్యంతో ఎంజేపీ గురుకులాల సంస్థ సెక్రెటరీ సైదులు సూచనల మేరకు ఈ ఏడాది జులైలో సంబంధిత అథారిటీలకు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో బీజాపూర్ సైనిక్‌స్కూల్ ప్రిన్సిపాల్ కెప్టెన్ రాజ్యలక్ష్మీ పృథ్వీరాజ్, నల్లగొండ కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పాఠశాలను సందర్శించారు. దరఖాస్తుతో జతచేసిన అంశాలను, పత్రాలను పరిశీలించారు. పరిశీలన నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. వారి వెంట ఆర్‌సీఓ స్వప్న, ప్రిన్సిపాల్ రవికుమార్ తదితరులు ఉన్నారు.
స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా అరుణప్రియ


