యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు
నల్లగొండ టూటౌన్ : మత్తు మందులు, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు యువత బానిస కావద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ పట్టణంలోని గౌతమి జూనియర్ కళాశాలలో పోలీస్, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మత్తు మందులకు ఒకసారి అలవాటైతే వాటిని వదులుకోవడం కష్టమని, దీనివల్ల భవిష్యత్ నాషనం అవుతుందని పేర్కొన్నారు. నిషేధిత పదార్థాలను తీసుకోవడం తప్పు అని, జీవితం బాగుండాలంటే కష్టపడి చదువుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకొని సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలన్నారు. అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువతపైనే ఆధార పడిఉందన్నారు. అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, డిప్యూటి డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


