వందేళ్ల పోరాటాల చరిత్ర సీపీఐ సొంతం
చండూరు : ప్రజా సమస్యలపై వందేళ్లుగా పోరా టాలు చేసిన చరిత్ర సీపీఐ సొంతమని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఖమ్మంలో జరగనున్న సీపీఐ వంద సంవత్సరాల ముగింపు వేడుకల సందర్భంగా గద్వాల నుంచి ప్రారంభమైన ప్రచార జాత మంగళవారం చండూరుకు చేరుకుంది. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు ప్రచార జాతకు ఘనస్వాగతం పలికారు. అనంతరం సభలో ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ ఖమ్మం సభకు మునుగోడు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకుడు ఉజ్జిని రత్నాకర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రాలమలింగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పేదల పక్షాన పోరాడేది సీపీఐ
మర్రిగూడ : పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాడేది కేవలం సీపీఐ మాత్రమేనని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఖమ్మంలో జరగనున్న సీపీఐ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలను జయప్రదం చేసేందుకు చేపట్టిన ప్రచార జాత మంగళవారం మర్రిగూడ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగింపు ఉత్సవాలకు పార్టీ శ్రేణులు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలనరసింహా, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కురుమిద్ద శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈదుల భిక్షంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


