42 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం
నల్లగొండ టౌన్ : బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ చక్రహరి రామరాజు అన్నారు. ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీ కళాశాల వద్ద రన్ ఫర్ సోషల్ జస్టీస్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరతరాలుగా బీసీలు వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు జనాభా ప్రకారం అన్ని రకాలుగా హక్కులను పొందాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలను మోసం చేసే పార్టీలకు రానున్న రోజులలో తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేశబోయిన శంకర్‌ముదిరాజ్, కాసోజు విశ్వనాథం, నకిరేకంటి కాశయ్యగౌడ్, చిక్కుళ్ల రాములు, కంది సూర్యనారాయణ, జె.ఇంద్రయ్య, శ్యాంసుందర్, కేశవులు, వాడపల్లి సాయిబాబా, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, సీతారాములు, కొల్లోజు సత్యనారాయణ, భాస్కర్, శంకరాచారి, సమీర్, శంకర్, మాధవి, మధుయాదవ్, లింగస్వామి, శివ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.


