హైవేపై వాహనాల రద్దీ
చిట్యాల : హైదరాబాద్ – విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం నుంచి వాహనాల రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వైపునకు వాహనాలు భారీగా వెళ్తున్నాయి. చిట్యాల పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులతో సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ట్రాఫిక్ జాం కాకుండా చిట్యాల పోలీసులు పర్యవేక్షించారు.
చిట్యాల వద్ద హైదరాబాద్
వైపునకు వెళుతున్న వాహనాలు


