మిర్యాలగూడ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై వేటు
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస సమరథ్‌పై వేటు పడింది. ఆయనను సూపరింటెండెంట్ పోస్టు నుంచి తప్పించి అతడి స్థానంలో డాక్టర్ బి.రంగయ్యను నియమిస్తూ జిల్లా వైధ్యాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో శనివారం రంగయ్య బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజులుగా ఏరియా ఆస్పత్రిలో నిర్వహణ గాడి తప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే సూపరింటెండెంట్‌ను తొలగించారని ప్రచారం జరగుతోంది. దీనికితోడు ఇటీవల ఒక మహిళ వైద్యం కోసం ఆస్పత్రికి రాగా ఆమెకు సరైన వైద్యం అందక మృతి చెందిందని రోగి బందువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. దీనిపై కలెక్టర్ సైతం సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో ఏరియా ఆస్పత్రిని గాడిలో పెట్టేందుకు జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకున్నారు. దీంట్లోభాగంగా డాక్టర్ రంగయ్యను సూపరింటెండెంట్‌గా నియమించినట్టు తెలుస్తోంది.
ఫ కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ రంగయ్య నియామకం


