బెదిరింపులతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచింది
నకిరేకల్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేయడంతోపాటు బెదిరింపులతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి దొంగ ఓట్లతో గెలిచిందని, అక్కడ నైతిక విజయం బీఆర్‌ఎస్ పార్టీదేనని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ప్రధానంగా ప్రచార సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. గత ఎన్నికలతో పోల్చితే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ బలహీన పడలేదన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రకటించిన ప్రకటనలు ఉత్తవేనని అన్నారు. దివగంత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాల హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు సెంటర్లను మహిళలకు కేటాయించకుండా పీఏసీఎస్ వారికి అప్పగించడం రైతులను దోపిడీ చేసేందుకేనని మండిపడ్డారు. సీసీఐ కేంద్రాల్లో పత్తి బాగా లేదని ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ సీఎం సీట్లో కూర్చోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో నకిరేకల్ మార్కెట్ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ తలారి బలరాం, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మాజీ ఎంపీటీసీ గుర్రం గణేష్, నాయకులు గోర్ల వీరయ్య, రాచకొండ వెంకన్నగౌడ్, పల్లె విజయ్ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


