ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం
నార్కట్‌పల్లి: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన మందడి సుఖేందర్‌రెడ్డి(40) 20 ఏళ్ల క్రితం నార్కట్‌పల్లికి వలస వచ్చి ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. సుఖేందర్‌రెడ్డికి స్వగ్రామం పుల్లెంలలో ఎకరం భూమి ఉండగా.. అందులో పత్తి సాగుచేస్తున్నాడు. సరైన దిగుబడులు రాక అప్పుల పాలైన సుఖేందర్‌రెడ్డి మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.
మృతుడి నేత్రాలు దానం..
మృతుడు సుఖేందర్‌రెడ్డి నేత్రాలను కుటుంబ సభ్యుల అనుమతితో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ సభ్యులు సేకరించారు.


