నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు
నల్లగొండ టూటౌన్: నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శుకవ్రా రం నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవి తాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, ఎస్‌బీ సీఐ రాము, వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ లచ్చిరెడ్డి, పాఠశాల ప్రిన్సి పాల్ ఉదయ్‌కుమార్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎక్స్‌రే స్కానింగ్‌ను సద్వినియోం చేసుకోవాలి
నల్లగొండ: జిల్లా క్షయ నివారణ కేంద్రం సహకారంతో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కోసం ఏర్పాటు చేసిన ఏఐ టెక్నాలజీ ఎక్స్‌రే స్కానింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని పోలీస్ కార్యా లయంలో ఆధునిక ఏఐ టెక్నాలజి ఎక్స్‌రే స్కానింగ్ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 14 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ మొబైల్ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఛాతీ ఎక్స్‌రే, రక్త పరీక్షలు చేస్తారన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐ సంతోష్, డాక్టర్ ప్రదీప్, రవి ప్రసాద్, జమా ల్, సూపర్‌వైజర్ బి.అనిల్ కుమార్, ఎం.సైదులు, వెంకట రెడ్డి, సయాదుద్దీన్, ఇనాయత్ అలీ, లెనిన్ పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


