బీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే..
నల్లగొండ టౌన్: బీసీ రిజర్వేషన్ పెంచే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్లగొండలోని గడియారం సెంటర్ వద్ద బీసీ జేఏసీ నిర్వహించిన అర్ధనగ్న ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం ధర్మబద్ధమైనదని, ఎస్సీ, ఎస్టీ అగ్రకులాలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడు బీసీలకు మాత్రం ఎంతకు కల్పించరని ప్రశ్నించారు. గల్లి నుంచి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెరువు వెంకన్నగౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్‌గౌడ్, రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు చెన్నయ్య, దుడ్డు కృష్ణమూర్తి, పుట్ట వెంకన్నగౌడ్, కట్టెకోలు దీపేందర్, చిలకరాజు సతీష్ కుమార్, కర్నాటి యాదగిరి, తల్లారి యాదగిరి, ఎంఏ.ఖదీర్, చెన్నూరి భరద్వాజ, నీలకంఠం నాగరాజు, మార్గం సతీష్ కుమార్, చెన్నోజు రాజు, పి.నాగరాజు, బి.ధర్మేందర్, ఆర్.బాలాజీ పాల్గొన్నారు.


