పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో శుక్రవారం అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్రీశైలం, కోశాధికారి జి.మోహన్‌రెడ్డి, గాయం నారాయణరెడ్డి, రంగయ్య, మోహన్‌రావు, యుగేందర్‌రెడ్డి, ఆంజనేయులు, కృష్ణయ్య, కె.నారాయణరెడ్డి, బి.లింగయ్య, ఎండీ హుస్సేన్, ఎం.శంకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, యాదగిరి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


