బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలి
నల్లగొండ టూటౌన్: చదువే ధ్యేయంగా బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుంచే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలన్నారు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని పరిమితం చేయాలన్నారు.ఆడపిల్లలు మంచిగా చదువుకుంటే కలెక్టర్లుగా, డాక్టర్లుగా తయారు కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, సీడబ్ల్యూసీ చైర్మన్ చింత కృష్ణ, నాగసేనారెడ్డి, డీసీపీఓ గణేష్, సరి త, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కావొద్దు
నల్లగొండ: ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కావొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇతర కళాశాలల్లనూ ర్యాగింగ్‌కు పాల్పడకుండా గట్టి నిఘా పెట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ జె.సత్యనారాయణ, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, కళాశాల అదనపు ప్రిన్సిపాల్ ఆర్.రాధాకృష్ణ, సురేస్ గుప్తా పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


