జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి
రామగిరి(నల్లగొండ): జిల్లా కేంద్రంలోని ప్రధాన గ్రంథాలయ అభివృద్ధికి కృషిచేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హాఫీస్ ఖాన్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని జిల్లా గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి సహకారంతో ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణం జరుగుతుందన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. ఈ గ్రంథాలయానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పించామన్నారు. గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 20 వరకు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూపూడి రమేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోద్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అసోసియేషట్ ప్రెసిడెంట్ ఎస్.వేణుగోపాలచార్యులు, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఎంఎస్.శ్రవణ్‌కుమార్, మాజీ కౌన్సిలర్లు బషీరుద్దీన్, సమద్, డీసీసీబీ డైరెక్టర్ సంపత్‌రెడ్డి, అల్లి సుభాష్, చొల్లేటి ప్రభాకర్, లైబ్రేరియన్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
కేతేపల్లి: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నకిరేకల్ సీనియర్ జవిల్ జడ్జి, న్యాయసేవా అధికారిణి మంజుల సూర్యావర్ అన్నారు. నకిరేకల్ మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కేతేపల్లి మండలంలోని చెర్కుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాజేంద్రప్రసాద్, న్యాయవాదులు ప్రకాశ్‌రావు, దోడ సోమయ్య, చౌగోని నాగరాజు, వంగూరి వెంకన్న, కేతేపల్లి ఏఎస్‌ఐ ఖాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి


