ఎంపీడీఓల క్షేత్రస్థాయి సందర్శన | - | Sakshi
Sakshi News home page

ఎంపీడీఓల క్షేత్రస్థాయి సందర్శన

Nov 15 2025 7:47 AM | Updated on Nov 15 2025 7:47 AM

ఎంపీడీఓల క్షేత్రస్థాయి సందర్శన

ఎంపీడీఓల క్షేత్రస్థాయి సందర్శన

రామగిరి(నల్లగొండ): ఇటీవల నూతనంగా విధుల్లో చేరిన వివిధ మండలాలకు చెందిన ఎంపీడీఓలు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా శుక్రవారం నల్లగొండ మండలం దండెంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని ఇందిరమమ్మ ఇళ్లు, సిమెంట్‌ రోడ్లు, నర్సరీ, ఐకేపీ సెంటర్‌, డంపింగ్‌ యార్డులను పరిశీలించారు. వీరికి గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్లగొండ ఎంపీడీఓ యాకుబ్‌నాయక్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు జె.మహేష్‌, హిమబిందు, స్వర్ణలత, వేద రక్షిత, వంశీధర్‌ ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement