దర్వేశిపురంలో నేడు బహిరంగ వేలం
కనగల్ : మండల పరిధిలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద ఏడాది కాలానికి (2026) వస్తు విక్రయ హక్కులను కల్పించేందుకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొబ్బరికాయల వేలంలో పాల్గొనే వారు రూ.10 లక్షలు, పూలుపండ్లకు రూ.3 లక్షలు, గాజుల అమ్మకాలకు రూ.1లక్ష, ఆలయ ఫంక్షన్‌హల్‌కు రూ.50 వేలు, దేవస్థానం వద్ద ఫొటోలు తీయడానికి రూ.20 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటలలోపు షీల్డ్ టెండర్‌కు డీడీని జతపరిచి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్‌లో వేయాలని సూచించారు.
బుద్ధవనం అద్భుతం
ఫ రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల
పెద్దవూర : సాగరతీరంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం అద్భుతమైన శిల్పకళా నిర్మాణమని రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల ప్రశంసించారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక ఆయన బుద్ధవనాన్ని సందర్శించి, బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం మహాస్థూపం సమావేశ మందిరంలో ప్రదర్శించిన బుద్ధవనం విశేషాలపై లఘు చిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర ఎంపీ సిన్హాకు బుద్ధవనం నిర్మాణ విశేషాలను తెలియజేసి కండువాతో సత్కరించి, బుద్ధవనం బ్రోచర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశపు సంస్కృతికి, చరిత్రకు బుద్ధవనం ప్రతీకగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, బీజేపీ యువమోర్చా నాయకుడు శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మేనేజర్ ఏ.అనిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 76600 22517, 08682 244416 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఎంజీయూ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో పీజీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఎంజీయూ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షలకు 1160 మంది విద్యార్థులు హాజరు కాగా 794 మంది ఉత్తీర్ణత సాధించినట్లు యూనివర్సిటీ సీఓఈ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అలువాల రవి, డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆకుల రవి, లక్ష్మీప్రభ, సంధ్యారాణి పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
మునుగోడు : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. గురువారం ఆయన మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా అమర్చిన టీబీ ఎక్స్‌రే మిషన్ పనితీరును పరిశీలించారు. ఆ మిషన్ ద్వారా ఎక్స్‌రే తీయించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటుచేసి ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
దర్వేశిపురంలో నేడు బహిరంగ వేలం
దర్వేశిపురంలో నేడు బహిరంగ వేలం


