ఆడిట్‌తో అక్రమాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆడిట్‌తో అక్రమాలకు చెక్‌

Nov 14 2025 8:43 AM | Updated on Nov 14 2025 8:43 AM

ఆడిట్‌తో అక్రమాలకు చెక్‌

ఆడిట్‌తో అక్రమాలకు చెక్‌

ఒక్కో సంఘం ఆడిటింగ్‌కు రూ.వెయ్యి..

పారదర్శకత కోసమే ఆడిటింగ్‌

ఎస్‌ఎల్‌ఎఫ్‌ సంఘాల పొదుపుపై కొనసాగుతున్న ఆడిట్‌

నీలగిరి పట్టణంలో 75 సంఘాలు

నీలగిరి పట్టణంలో ఎస్‌ఎల్‌ఎఫ్‌ సంఘాలు 75 ఉండగా.. వీటిలో 750 మంది సభ్యులు ఉన్నారు. వీరు ప్రతినెలా పొదుపు చేసిన డబ్బులు, తీసుకున్న రుణం, ఇచ్చిన అప్పు తదితర లెక్కలు పక్కాగా తీయడానికి ఒక్కో పొదుపు సంఘానికి ఆడిట్‌ చేసే సిబ్బంది రూ.1000 చొప్పున తీసుకుంటున్నారు. అయితే పొదుపు సంఘాల మహిళలకు ఆడిట్‌ ఖర్చు ఎక్కువగానే ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇద్దరు సిబ్బంది 75 సంఘాలను రెండు రోజుల్లోనే ఆడిట్‌ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అందుకు రూ.75 వేలు అవుతుండడం గమనార్హం.

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి పట్టణంలోని స్లమ్‌ లెవర్‌ ఫెడరేషన్‌ (ఎస్‌ఎల్‌ఎఫ్‌) సంఘాల మహిళల పొదుపు లావాదేవీలపై ఆడిటింగ్‌ ప్రారంభమైంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్‌ జరుగుతోంది. స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్‌ కింద నీలగిరిలో 75 పొదుపు సంఘాలు ఉన్నాయి. ఇటీవల 40 సంఘాల ఆడిట్‌ పూర్తి కాగా, గురువారం 35 సంఘాల వారు ఆడిటింగ్‌ చేయించారు. ఏటా ఆడిటింగ్‌ చేయడం ద్వారా సంఘంలో జరిగే పూర్తి వివరాలు తెలియడంతోపాటు అక్రమాలకు సైతం చెక్‌ పడనుంది. రూపాయితో సహా అన్నింటిని సంఘ సభ్యులకు పేపర్‌పై రాసి లెక్కలు చెబుతున్నారు.

రూ.1000 వరకు పొదుపు

నీలగిరి మున్సిపాలిటీ పరిధిలో స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్‌ కింద 75 పొదుపు సంఘాలు ఉన్నాయి. ప్రతి 15 సంఘాలు కలిసి ఎస్‌ఎల్‌ఎఫ్‌ సంఘంలో నెలకు రూ.100 నుంచి రూ.1000 వరకు పొదుపు చేసుకుంటున్నారు. బ్యాంకుతో సంబంధం లేకుండానే పొదుపు చేసుకున్న డబ్బులను సంఘంలో వ్యాపార అవసరాలు ఉన్న మహిళలు అప్పుగా ఇస్తారు. అప్పు తీసుకున్న మహిళ వడ్డీతో సహా నెలనెలా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వారి వ్యాపారాన్ని బట్టి ఒకొక్కరికి రూ.లక్ష వరకు రుణం ఇస్తుంటారు. ఆయా సంఘాల వారు పొదుపు చేసుకుంటున్న డబ్బులు, తీసుకున్న రుణం, చెల్లింపులు, అప్పు తదితర వాటిపై ఆడిటింగ్‌ చేయాల్సి ఉంటుంది. దాంతో 75 ఎస్‌ఎల్‌ఎఫ్‌ సంఘాల లావాదేవీలను ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సిబ్బంది ఆడిట్‌ చేస్తున్నారు.

ఏటా ఆడిటింగ్‌..

పొదుపు సంఘాల మహిళలు తమ అవసరాల కోసం తీసుకుంటున్న రుణాలను తిరిగి చెల్లింపులు జరుపడం, 15 సంఘాల వారు కలిసి పొదుపు చేసుకోవడం, రుణాలు తీసుకోవడం, వ్యాపార అవసరాల కోసం వాడుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇలా తీసుకుంటున్న రుణం, వడ్డీ తదితర వాటికి సంబంధించిన డబ్బుల లావాదేవీలు పారదర్శకంగా ఉండాల్సి ఉంటుంది. దాంతో ప్రతి సంవత్సరం ఆడిటింగ్‌ ప్రక్రియ చేపట్టి అవకతకలను గుర్తిస్తుంటారు.

ఎస్‌ఎల్‌ఎఫ్‌ సంఘాలు పొదుపు చేసుకుంటున్న డబ్బులు, ఇచ్చే రుణం, అప్పు తదితర వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం ఆడిటింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. 2024–25 ఆర్థిక సంవత్సర ఆడిటింగ్‌ నడుస్తుంది. చిన్న, చిన్న పొరపాట్లు ఉన్నా.. గుర్తించి లెక్కలు సరిచేస్తారు. పారదర్శకత కోసమే ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నాం.

– శ్రీనివాస్‌, మెప్మా టీఎంసీ, నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement