6,57,229 ఎకరాల్లో సాగు
ముందస్తుగా సిద్ధమవుతున్నాం
యాసంగి ప్రణాళిక ఖరారు చేసిన వ్యవసాయ శాఖ
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. గత యాసంగి సీజన్‌లో వరి, ఇతర పంటలు కలిపి 6,49,712 ఎకరాల్లో రైతులు సాగు చేయగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో 6,57,229 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేస్తోంది. ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు అవసరమో గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.
విత్తనాలకు ఇండెంట్
యాసంగి సీజన్‌కు సంంధించిన వరి, పెసర, వేరుశనగ విత్తనాల కోసం జిల్లా వ్వవసాయ శాఖ అంచనా లు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపించింది. వరి విత్తనాలైన ఎంటీయూ 1010, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్ 15048, జేజీఎల్ రకాలు 1,20,850 క్వింటాళ్లు, పెసర 1100 క్వింటాళ్లు, వేరుశనగ 22,180 క్వింటాళ్లు అవసరంగా గుర్తించిన వ్యవసాయ శాఖ దానికి సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.
1,62,200 టన్నుల ఎరువులు అవసరం
జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌కు 1,62,200 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా జిల్లా వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. అందులో యూరియా 74,955.08 మెట్రిక్ టన్నులు, డీఏపీ 18,582.69 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 14,600.68 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 46,628.22 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 7433.07 మెట్రిక్ టన్నులు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.
యాసంగి సాగు అంచనా
వివరాలు ఇలా
పంట ఎకరాలు
వరి 5,64,678
సజ్జ 50
జొన్న 1,400
మొక్కజొన్న 825
పెసర 1,100
వేరుశనగ 22,180
ఉదాన పంటలు 65,794
ఇతర పంటలు 1,202
మొత్తం 6,57,229
యాసంగి సీజన్‌కు అవసరమైన విత్తనాలు,ఎరువులను ముందస్తుగా రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలను రూపొందించాం. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – పాల్వాయి శ్రవణ్‌కుమార్,
జిల్లా వ్యవసాయ అధికారి
6,57,229 ఎకరాల్లో సాగు


