బీసీ జేఏసీ ధర్మపోరాట దీక్ష
నల్లగొండ టౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక ఎన్జీ కళాశాల వద్ద ధర్మపోరాట దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు మాట్లాడుతూ బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ఫ్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బాధ్యతను తీసుకుని పార్లమెంట్‌లో చట్టపవరణ చేయించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తండు సైదులుగౌడ్, సుంకరి మల్లేష్‌గౌడ్, పిల్లిరామరాజు, కేశబోయిన శంకర్‌ముదిరాజ్, కంది సూర్యనారాయణ, కొల్లోజు సత్యనారాయణ, నేటపట్ల సత్యనారాయణ, కాసోజు విశ్వనాథం, నకిరేకంటి కాశయ్యగౌడ్, చిక్కుళ్ల రాములు, జివ్వాజి ఇంద్రయ్య, సీతారాములు, శంకర్, సాయిబాబా, వెంకటేశ్వర్లు, నల్ల సోమమల్లయ్య, ఎల్లంరాజు, చొల్లేటి రమేష్, శ్యాంసుందర్, ఆదినారాయణ, మధుయాదవ్, రాములు, గోవర్ధనచారి పాల్గొన్నారు.


