ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించొద్దు
మునుగోడు : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం ఆమె మునుగోడులో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాల ప్రకారం రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే వెంటనే కాంటా వేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పత్తి సాగుచేసిన రైతులు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్ముకునేందుకు 12 శాతంలోపు తేమతో ఉంటేనే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆమె కిష్టాపురం గ్రామంలో ఓ యువ రైతు సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేసే పంటలను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్యం ధరిచేరదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఎం గోపికృష్ణ, డీఎస్‌ఓ వెంకటేష్, డీసీఓ సత్యనాయక్, ఆర్‌డీఓ శ్రీదేవి, తహసీల్దార్ నరేష్, సీఈఓ సుఖేందర్ తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


