ధాన్యం తూకాల్లో మోసాలు
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ : ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు వారికి అనుకూలంగా ఉండేవారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించి తూకాల్లో మోసాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ ఆరోపించారు. నకిరేకల్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు 2 కేజీలు అధికంగా తుకాలు వేస్తున్నారని, నిర్వాహకులకు కమీషన్ ఇస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, తలారి బలరాం, మారం వెంకట్‌రెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, గొర్ల వీరయ్య, పేర్ల కృష్ణకాంత్ తదితరులు ఉన్నారు.


