వావ్‌.. వండర్‌ కిడ్స్‌ | - | Sakshi
Sakshi News home page

వావ్‌.. వండర్‌ కిడ్స్‌

Nov 14 2025 8:43 AM | Updated on Nov 14 2025 8:43 AM

వావ్‌

వావ్‌.. వండర్‌ కిడ్స్‌

బాల కార్మిక చట్టం బాల్య వివాహాల నిరోధక చట్టం పోక్సో చట్టం బాలల సంరక్షణ చట్టం అద్వైత్‌.. అద్భుతమైన మెమొరీ

బాలల రక్షణకు ప్రత్యేక చట్టాలు

చివ్వెంల(సూర్యాపేట): బాలల హక్కుల్ని కాపాడేందుకు 1989 నవంబర్‌ 20న ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల తీర్మాణాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో భారత్‌ సభ్య దేశం కాబట్టి 1992 డిసెంబర్‌ 11న ఈ తీర్మాణాన్ని ఆమోదించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1 ప్రకారం 18ఏళ్ల లోపు వయస్సు వారంతా బాలలే. బాలల రక్షణ కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి. ఆర్టికల్‌ 1 నుంచి 52 వరకు బాలల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రక్షణ చట్టాలను అమలు చేసింది.

విద్యాహక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు బాలబాలికలు బడిలో మాత్రమే ఉండాలి. గనులు, ఇటుక బట్టీలు, హైరిస్క్‌ ప్రాంతాలు, కిరాణా షాపుల్లో బాలల చేత పనులు చేయించరాదు. బాల కార్మిక చట్టం 1986, రూల్‌– 2బి ప్రకారం ఆర్‌టీఈ చట్ట ప్రకారం బాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పనిచేయరాదు. పెద్దలు చేసే పనికి ప్రత్యామ్నాయంగా పిల్లలు పని చేయరాదు. చట్టానికి వ్యతిరేకంగా బాలల చేత పనులు చేయిస్తే సంవత్సరం నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.

బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 సెక్షన్‌ 2(ఎ) ప్రకారం 18 ఏళ్లు నిండని అమ్మాయి, 21 ఏళ్లు నిండని అబ్బాయి బాల్య దశలో ఉన్నట్లుగా గుర్తించబడుతారు. బాల్య వివాహంలో యుక్త వయస్సు ఉన్న పురుషుడు, బాలిక తల్లిదండ్రులు, సంరక్షకులు, వివాహాన్ని జరిపించిన, ప్రోత్సహించిన వ్యక్తులు, వివాహ కార్యక్రమానికి హజరైన వ్యక్తులు దోషులుగా గుర్తించబడుతారు. వీరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, లేదా రూ.లక్ష జరిమానా విధిస్తారు.

పిల్లలపై లైంగిక దాడి చేయడం, అవమానించడం, వేధించడం నుంచి రక్షించేందుకు కేంద్రం ప్రభుత్వం 2012వ సంవత్సరంలో ది ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్స్‌వల్‌ అఫెన్స్‌ యాక్ట్‌(పోక్సో)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పిల్లలపై నేరానికి పాల్పడిన వారికి 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.

నేరారోపణ ఎదుర్కొంటున్న బాలలతో పాటు నేరం చేసినట్లు రుజువైన బాలల సంరక్షణ, వారి పోషణ, అవసరమైన పిల్లలకు వారి ప్రాథమిక అవసరాలు తీర్చడం, వారితో స్నేహపూర్వకంగా మెలగడం, పునరావాసం, వారికి అవసరమైన న్యాయ నిర్ణయాలు తీసుకోవడం కోసం చేసిన చట్టాలను ఏకం చేస్తూ సవరించిన చట్టం ఇది. ఈ చట్టం ద్వారా అనుకోని పరిస్థితుల్లో నేరాలకు పాల్పడిన బాలలకు సరైన రక్షణ, సంరక్షణ దొరుకుంతుంది.

అక్షయ సాధించిన

తెలుగు, వరల్డ్‌ బుక్‌ రికార్డుల సర్టిఫికెట్లు

అద్భుతమైన జ్ఞాపకశక్తితో ఔరా అనిపించుకుంటున్న బాలలు

తెలుగు, ఇండియా , వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులలో చోటు

నేడు బాలల దినోత్సవం

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట): సాధారణంగా రెండున్నర నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు అప్పుడప్పుడే ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ బుడతడు జంతువులు, స్వాతంత్రోద్యమ నాయకుల పేర్లతో సహా దాదాపు 10 అంశాలను గుర్తుంచుకుని అతి పిన్న వయస్సులోనే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించాడు. ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం నెమ్మికల్‌ గ్రామానికి చెందిన వెల్గూరి రాజేష్‌, లిఖితకు 2022లో వివాహం జరిగింది. రాజేష్‌ సూర్యాపేటలోని యూనియన్‌ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. లిఖిత గృహిణి. వీరికి కుమారుడు అద్వైత్‌ జన్మించగా.. ప్రస్తుతం అతడి వయస్సు 27 నెలలు. చిన్నప్పటి నుంచి అద్వైత్‌ చాలా చురకుగా ఉండేవాడు. ఇది గమనించిన తల్లి లిఖిత ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని అద్వైత్‌కు చెబుతూ ఉండేది. ఇలా చెప్పిన విషయాలను మరునాడు అడిగితే తిరిగి చెప్పేవాడు.

10 అంశాలతో రికార్డుల్లోకి..!

అద్వైత్‌ ఏడాది వయస్సు ఉన్నప్పుడే 10 మంది స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను చూపిస్తే వారిని గుర్తించి తిరిగి చెప్పేవాడు. అలాగే 10 శరీర భాగాలు, 10 రకాల జంతువులు, 12 రకాల ఫలాలు, ఏ నుంచి జెడ్‌ వరకు ఆంగ్ల వర్ణమాల పదాలు, 10 రకాల మంచి అలవాట్లు, 5 రకాల వాహనాల పేర్లు, 4 రకాల రంగులను వెంటనే గుర్తించి చెబుతాడు. వీటన్నింటిని రికార్డు చేసి తల్లిదండ్రులు అద్వైత్‌ 21 నెలల వయస్సులో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు పంపించగా.. రెండు నెలలకు అతడికి అందులో చోటు దక్కింది. ప్రస్తుతం ఇవే కాకుండా ఇంగ్లిష్‌లో నెలలు, వారాల పేర్లు చెబుతున్నాడు. మరో 10 దాకా వివిధ రాష్ట్రాల రాజధానులను అడిగితే టకీమని చెబుతూ అబ్బుర పరుస్తున్నాడు.

వావ్‌.. వండర్‌ కిడ్స్‌1
1/4

వావ్‌.. వండర్‌ కిడ్స్‌

వావ్‌.. వండర్‌ కిడ్స్‌2
2/4

వావ్‌.. వండర్‌ కిడ్స్‌

వావ్‌.. వండర్‌ కిడ్స్‌3
3/4

వావ్‌.. వండర్‌ కిడ్స్‌

వావ్‌.. వండర్‌ కిడ్స్‌4
4/4

వావ్‌.. వండర్‌ కిడ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement