గంజాయి నిందితుల రిమాండ్
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టబడ్డ నిందితులును గురువారం రిమాండ్‌కు తరలించినట్లు తరలించారు. హైదారాబాద్‌కు చెందిన అల్లం సాంబశివుడు, కర్రీ శ్రీనివాస్(24), కర్రీ రేషిత సంధ్య గంజాయిని ఏపీలోని సీలేరులో కొనుగోలు చేసి హైదారాబాద్‌కు తరలిస్తుండగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. వారి నుంచి 24 కేజీల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, లాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి
వేములపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. వేములపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండల కేంద్రానికి చెందిన పెదపంగ జానమ్మ(65) ఈ నెల 7న మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం సమీపంలో నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన జానమ్మను మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


