జల సంరక్షణలో నల్లగొండకు రెండో స్థానం
జల సంరక్షణ కోసం జిల్లాలోని తిరుమలగిరి సాగర్ మండలంలో అత్యధికంగా పనులు చేపట్టగా, ఆ తర్వాత స్థానంలో నాంపల్లి మండలం ఉంది. తిరుమలగిరి సాగర్‌లో 3,678 పనులు చేపట్టగా, నాంపల్లిలో 3,628 పనులను చేపట్టారు. అతి తక్కువగా మునుగోడు మండలంలో 1,410 పనులను చేపట్టారు.
నల్లగొండ : జల సంరక్షణలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జలశక్తి అబియాన్ కింద చేపట్టిన జల్ సంచయ్–జల్ భాగీదారీ (జేఎస్‌జేబీ) పథకం కింద డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పనులు చేపట్టారు. జల సంరక్షణ కోసం చేపట్టిన ఈ పనుల్లో అత్యధికంగా పనులు చేసినందుకుగాను నల్లగొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఈ నెల 18వ తేదీన కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుతో పాటు రూ.2 కోట్ల నగదు బహుమతిని అందుకోనున్నారు. జిల్లాకు అవార్డు దక్కడంపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డిని అభినందించారు.
జల శక్తి అభియాన్ కింద 13 రకాల పనులు
కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కింద జల సంరక్షణ కోసం జల్ సంచయ్–జల్ భాగీదారీ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలో నీటి సంరక్షణ కోసం గృహాల్లో మ్యాజిక్ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, పత్తి చేలలో కుంటలు, ఎంఐ ట్యాంకులు, చెరువుల పూడికతీత, ఊట కుంటలు, చెక్ డ్యామ్‌లు, గుట్టల వద్ద కందకాలు, వరద కట్టలు, బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు, రూప్ వాటర్ ఇంకుడు గుంతలను నిర్మించి నీటి సంరక్షణ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంపునకు చర్యలు చేపట్టింది.
మొత్తంగా 84,827 పనులు
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ పథకం కింద జిల్లాలోని 31 మండలాల పరిధిలో మే 2025 వరకు 84,827 పనులను చేపట్టారు. ఆ వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జల్ సంచయ్–జల్ భాగిదారి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసింది. చేసిన పనులకు సంబంధించి 99 శాతం వెరిఫికేషన్ పూర్తి చేయడంతో పాటు 31 మండలాల పరిధిలో 849 పనుల ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కేంద్ర అధికారులు బొల్లం సంతోష్‌కుమార్, ఆనంద్ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఈ ఏడాది జూన్ 19వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ఆయా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. ఆగస్టు 8వ తేదీన పరిశీలన పూర్తయింది.
అవార్డుకు నల్లగొండ ఎంపిక
రాష్ట్రంలోనే అత్యధికంగా 96 వేల పనులు చేపట్టి ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలువగా 84,827 పనులతో నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మంచిర్యాల జిల్లా మూడో స్థానంలో ఉంది. ఈ మూడు స్థానాలు దక్కించుకున్న జిల్లాలకు అవార్డుతోపాటు రూ.2 కోట్ల చొప్పున నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
జలశక్తి అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం
జిల్లాలో చేపట్టిన పనులు విజయవంత
మయ్యాయి. నీటి బొట్టును ఒడిసిపట్టడంలో జిల్లా బెస్ట్‌గా నిలిచింది. జలసంరక్షణ పనుల నిర్వహణలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే
రెండో స్థానంలో నిలిచి.. అవార్డుకు ఎంపికై ంది.
ఫ జల్ సంచయ్ – జల్ భాగీదారీ పథకం కింద అవార్డు
ఫ 31 మండలాల్లో 13 కేటగిరీల్లో 84,827 పనుల నిర్వహణ
ఫ పెద్ద ఎత్తున భూగర్భ జలాల సంరక్షణకు కృషి
ఫ 18న రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకోనున్న కలెక్టర్
జల సంరక్షణలో నల్లగొండకు రెండో స్థానం
జల సంరక్షణలో నల్లగొండకు రెండో స్థానం


