నేడు బీసీ జేఏసీ ధర్మ పోరాట దీక్షలు
నల్లగొండ టౌన్ : బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం ధర్మపోరాట దీక్షలను నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ చక్రహరి రామరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీక్షల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
జెడ్పీలో పదోన్నతులు
నల్లగొండ : నల్లగొండలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం 9 మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో కొప్పు రాంబాబు, తెలంగాణ పంచాయతీ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పిల్లలపై ప్రత్యేక
దృషి సారించాలి
కొండమల్లేపల్లి : చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృషి సారించాలని డీఈఓ భిక్షపతి అన్నారు. బుధవారం కొండమల్లేపల్లి, దేవరకొండలో గల పలు కళాశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఆయన వెంట సతీష్, దుండిగళ్ల అశోక్, యర్రమద గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.
‘కలల సందుక’ కవితా సంపుటి ఆవిష్కరణ
చిట్యాల : మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చెందిన దివంగత కవి, రచయిత డాక్టర్ మండల స్వామి రచించిన ‘కలల సందుక’ కవితా సంపుటిని మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్వామి సమసమాజాన్ని కాంక్షించే కవిత్యాన్ని రచించారనొ కొనియాడారు. డాక్టర్ నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ వృత్తిదారుల జీవితాన్ని కవిత్వంలో నిలిపారని చెప్పారు. పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్.బాలచారి, మోత్కూరి నరహరి, డాక్టర్ తండు కృష్ణకౌండిన్య, వేముగంటి మురళీకృష్ణ, ప్రవీణ్‌కుమార్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, డాక్టర్ ఉప్పల పద్మ, డాక్టర్ కనకటి రామకృష్ణ, గడ్డం శ్రీను, బండారు శంకర్, ప్రకాష్ పాల్గొన్నారు.
14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
రామగిరి(నల్లగొండ) : ఈ నెల 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 14 నుంచి 20వ తేదీ వరకు ప్రతి రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నేడు బీసీ జేఏసీ ధర్మ పోరాట దీక్షలు


