సదరం నూతన భవనం ప్రారంభం
నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా జనరల్ ఆస్పత్రిలో రూ. 30లక్షల వ్యయంతో నిర్మించిన సందరం కార్డుల జారీ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తర్వాత ఎక్కువగా ప్రసవాలు నల్లగొండ జీజీహెచ్‌లో అవుతున్నాయని చెప్పారు. సదరం నూతన భవనాన్ని ప్రారంభించామని, వైకల్యం కలిగిన వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.


