ప్రతి ఇంటినీ సర్వే చేయాలి
తిప్పర్తి : ముందస్తు జనగణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని తప్పకుండా సర్వే చేయాలని తెలంగాణ రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. 2027 జనగణనలో భాగంగా బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణన ఎంతో ముఖ్యమైనదని, ఎన్యూమరేటర్లు జాగ్రత్తగా చేయాలని సూచించారు. ప్రతి ఇంటిని జియోటాగ్ చేయాలని, ఇల్లు వివరాలను స్టేటస్‌ను పొందుపర్చాలన్నారు. మొదట ఇళ్లకు నంబర్ వేయాలని చెప్పారు. ఈ సర్వే ఆధారంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు సులువు అవుతుందన్నారు. ప్రతి ఎన్యూమరేటర్ జాగ్రత్తగా సర్వే చేయాలన్నారు. కార్యక్రమం తహసీల్దార్ రామకృష్ణ, ఎస్‌ఐ శంకర్, ఆర్‌ఐ ద్రోణార్జున తదితరులు పాల్గొన్నారు.


