గురుకులాల్లో వసతులు కల్పిస్తాం
ధాన్యం సేకరణపై దృష్టి పెట్టాలి
పెద్దవూర : మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మంగళవారం నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాల క్రీడామైదానంలో అండర్–14, అండర్–19 జిల్లాస్థాయి క్రీడాపోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించే విద్యార్థులకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తానని కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముందుగా ఆమె మహాత్మాజ్యోతిబాపూలే, సావిత్రీబాయి పూలే చిత్రపటాల వద్ద జ్యోతిప్రజ్వలన చేసి జాతీయ జెండాను, క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజశేఖర్, బీసీ గురుకులా ఆర్‌సీఓ స్వప్న, పెద్దవూర ఎంఈఓ తరిరాములు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, నందికొండ మున్సిపల్ కమిషనర్ వేణు, ప్రిన్సిపాల్స్ రవికుమార్, భవాని, ఎస్‌ఐ ముత్తయ్య పాల్గొన్నారు.
నల్లగొండ : వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై మంగళవారం వివిధ సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఏఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ధాన్యం సేకరణలో అక్రమాలకు పాల్పడినా.. నిర్లక్ష్యం వహించినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, డీఎస్‌ఓ వెంకటేష్, డీఎం గోపికృష్ణ, డీసీఓ పత్యానాయక్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


