అబుల్ కలాం ఆజాద్‌కు నివాళి
నల్లగొండ : భారత స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు, దేశ విద్యారంగ అభివృద్ధి ప్రదాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ప్రజలు ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ఆజాద్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్‌రెడ్డి, డీఈఓ భిక్షపతి, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, డాక్టర్ ఎంఏ.ఖాన్, సయ్యద్‌హసన్, ఎండీ.సలీం, ఎంఏ రఫీ ఉన్నారు.


