ఆంధ్రా ధాన్యం రాకుండా చెక్‌పోస్టులు
మిర్యాలగూడ : ఆంధ్రా నుంచి తెలంగాణలోకి ధాన్యం రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్ తెలిపారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లి శివారు సూర్య రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మిల్లులో ధాన్యం ట్రాక్టర్ల వద్ద ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా నుంచి ధాన్యం రాకుండా వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఈ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు రాకుండా మిల్లర్లు సాఫీగా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు రైస్ మిల్లర్లు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్‌కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, ఉపాధ్యక్షుడు గోళ్ల రామ్‌శేఖర్, మోహన్‌రావు తదితరులు ఉన్నారు.
ఫ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్


