ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. మొత్తం 94 ఫిర్యాదులు రాగా.. 31 జిల్లా శాఖలకు సంబంధించినవి, 63 ఫిర్యాదులు రెవెన్యూ సమస్యలపై వచ్చాయి. ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఒకవేళ పరిష్కారానికి అవకాశం లేకపోతే సరైన కారణాలను సంబంధిత ఫిర్యాదుదారుడికి తెలుపాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ అశోక్‌రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


