రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
నల్లగొండ : రోడ్డు భద్రతను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. మానవ తప్పిదాలతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వివిధ శాఖలు సమన్వయంతో వ్యక్తిగత శ్రద్ధ వహించి పనిచేయాలని సూచించారు. పోలీస్ శాఖ గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు ఆర్‌అండ్‌బి, నేషనల్ హైవే అథారిటీ, ఇతర శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి స్కూల్ బస్సుకు సైడ్ మిర్రర్లు ఏర్పాటు చేసుకోవాలని, సహాయకుడిని నియమించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అన్ని వాహనాలకు రేడియం స్టిక్కర్లు అంటించుకోవాలన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత శాఖ అధికారులకు తెలియజేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఆర్‌అండ్‌బి ఈఈ శ్రీధర్‌రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం కె.జానిరెడ్డి, డీఈఓ భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, డీఎస్పీ శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


