విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడొద్దు
నల్లగొండ టౌన్ : విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. సోమవారం నల్ల గొండలోని మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్ అనే విష సంస్కృతికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. నేటి సీనియర్లు ఒకప్పుడు జూని యర్లు అనే విషయం మరచిపోవద్దని హితవు పలికారు. ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం, ర్యాగింగ్‌కు పాల్పడితే ఒకసారి కేసు నమోదైతే, 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. మానసికంగా, శారీరకంగా అవమానపరచడం, భయపెట్టడం, భయం కలిగేటట్లు చేయడం, అమర్యాదగా ప్రవర్తించడం, కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని తెలిపారు. ర్యాగింగ్ భూతాన్ని కళాశాల నుంచి తరిమేయాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే బాధితులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్బీ సీఐ రాము, వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సైదులు, కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ రాదాకృష్ణ పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్


