మూడు రోజుల్లోనే కుమారుడు, తండ్రి మృతి
భూదాన్‌పోచంపల్లి: మూడు రోజుల్లోనే కుమారుడు, తండ్రి మృతిచెందిన విషాద ఘటన భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్‌పురం గ్రామానికి చెందిన గడ్డం ప్రభాకర్‌గౌడ్(68)కు భార్య మణెమ్మ, ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలు చేశాడు. ప్రభాకర్‌గౌడ్ అక్టోబర్ 30న తన భార్య మణెమ్మతో కలిసి స్కూటీపై పోచంపల్లికి వచ్చి తిరిగి జలాల్‌పురం వెళ్తుండగా.. గ్రామ సమీపంలో రోడ్డుకు అడ్డంగా వచ్చిన కోతిని తప్పించబోయి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ప్రభాకర్‌గౌడ్ తలకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లాడు. అతడి భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రభాకర్‌గౌడ్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రభాకర్‌గౌడ్ చిన్న కుమారుడు మహేందర్(38) కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతూ గురువారం మృతిచెందాడు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు మహేందర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్‌గౌడ్ కూడా శనివారం తెల్ల వారుజామున మృతిచెందాడు. మూడు రోజుల్లోనే కుమారుడు, తండ్రి మృతిచెందడంతో జలాల్‌పురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మూడు రోజుల్లోనే కుమారుడు, తండ్రి మృతి


