ముగిసిన గురుకుల జోనల్ స్థాయి క్రీడాపోటీలు
రాజాపేట : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న 11వ జోనల్ స్థాయి బాలుర క్రీడా పోటీలు శనివారం ముగిసాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడాపోటీల్లో ఐదవ జోన్ యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని 13 గురుకులాలకు చెందిన 1105 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ అధ్యక్షతన ముగింపు సమావేశం నిర్వహించగా స్థానిక ఎస్‌ఐ అనిల్‌కుమార్ ముఖ్య అథిదిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీసీఓ సుధాకర్, క్రీడల సమన్వయకర్త శ్రీనివాస్, పీడీలు కిషన్, వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ వేణు, ఉపాధ్యాయులు రాజు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
అండర్ 14, 19 విభాగాల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ స్టేషన్‌ఘన్‌పూర్ గురుల విద్యార్థులు నిలిచారు. అండర్ 19 విభాగాల్లో మిర్యాలగూడ గురుకుల విద్యార్థులు, అథ్లెటిక్స్ అండర్ 14లో చండూరు, అండర్ 17, 19 విభాగాల్లో స్టేషన్ ఘన్‌పూర్ గురుల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించారు. కబడ్డీ అండర్ 14లో అనుముల విద్యార్థులు ప్రథమ స్థానం, అండర్ 17, 19 విభాగాల్లో రాజాపేట ప్రథమ స్థానం సాధించింది. ఖోఖో అండర్ 14లో ఘన్‌పూర్, అండర్ 17, 19లో మిర్యాలగూడ, వాలీబాల్ అండర్ 17లో మునగాల, అండర్ 19లో భువనగిరి, బాల్‌బాడ్మింటన్ అండర్ 17లో చండూరు, అండర్ 19లో మిర్యాలగూడ, హ్యాండ్‌బాల్ అండర్ 17లో రాజాపేట, అండర్ 19లో జనగాం. ఫుట్‌బాల్ అండర్ 17లో చండూరు, అండర్ 19లో జనగాం, టెన్నికై ట్ అండర్ 14, 17, 19లో ఘన్‌పూర్, చెస్ సింగిల్ అండర్ 14లో హుజూర్‌నగర్, అండర్ 17లో మునగాల, అండర్ 19లో ఘన్‌పూర్, చెస్ డబుల్ అండర్ 14లో మోత్కూర్, అండర్ 17, 19లో హుజూర్‌నగర్ గురుకులాలు ప్రథమ స్థానం సాధించాయి.
ముగిసిన గురుకుల జోనల్ స్థాయి క్రీడాపోటీలు


