కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఆత్మహత్య
కొండమల్లేపల్లి: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని పశువుల సంతలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. శనివారం కొండమల్లేపల్లి ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన జెట్టమోని నరసింహ(55) భార్య గెల్వలమ్మ కరోనా సమయంలో మృతిచెందింది. నరసింహ హైదరాబాద్‌లో తన కుమారుడు జెట్టమోని ఆంజనేయులు, కోడలు మాధవి వద్ద ఉంటూ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కుమారుడు, కోడలు తరచూ గొడవ పడుతుండడంతో మనస్తాపానికి గురైన నరసింహ శుక్రవారం సాయంత్రం డ్యూటీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి కొండమల్లేపల్లికి వచ్చాడు. అర్ధరాత్రి స్థానిక పశువుల సంతలోని రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుడి జేబులో నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ ద్వారా అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మూసీ నదిలో
బాలిక గల్లంతు
నేరేడుచర్ల: మూసీ నదిలో ఈతకు వెళ్లి బాలిక గల్లంతైంది. ఈ ఘటన శనివారం నేరేడుచర్ల మ ండలం బురుగులతండా వద్ద జరిగింది. స్థానిక ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం సోమావరం గ్రామానికి చెందిన కోమరాజు సుష్మిత (13)తో పాటు దీక్షిత, అశ్విని కలిసి బురుగులతండా వద్ద గల సోమప్ప ఆలయం వెనుక భాగంలో మూసీ నదికి ఈత కొట్టేందుకు వెళ్లారు. సుష్మిత ఈత కొడుతూ నదిలో గల్లతైంది. ఆమె వెంట బాలికలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీంను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శనివారం రాత్రి వరకు కూడా సుష్మిత ఆచూకీ లభించలేదు.
కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఆత్మహత్య


