షార్ట్ సర్క్యూట్ తో ఆర్‌ఎంపీ క్లినిక్ దగ్ధం
నార్కట్‌పల్లి: షార్ట్ సర్క్యూట్‌తో ఆర్‌ఎంపీ క్లినిక్ దగ్ధమైంది. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ తాడోజు శంకరాచారి అదే గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. శనివారం అతడు క్లినిక్‌లో లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి కంప్యూటర్, ఫ్రిజ్, మందులు కాలిపోయాయి. సుమారు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు శంకరాచారి తెలిపారు.
పశు ఔషధ బ్యాంకుకు
‘నియోస్పార్క్’ సహకారం
కోదాడరూరల్: రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన పశు ఔషధ బ్యాంకుకు సహకారం అందించేందుకు పశు ఔషధ కంపెనీ నిమోస్పార్క్ ముందుకొచ్చింది. శనివారం స్థానిక పశు వైద్యశాలలో ఆ కంపెనీ తెలంగాణ రీజనల్ మేనేజర్ చల్లా వెంకటేశ్వర్లు పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్‌తో కంపెనీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. తక్కువ ధరలకే మందులు అందజేసేందుకు పశు ఔషధ బ్యాంకు ఏర్పాటు చేసిన పెంటయ్యతో పాటు పశుపోషకులకు అండగా ఉంటామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ తయారీ ధర కంటే తక్కువకే ఐరన్, మల్టీవిటమిన్ ఫెర్‌ాట్సన్ టానిక్‌ను అందజేసేందుకు ముందుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ సిరిపురపు సురేంద్ర, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.


