నల్లబెల్లం, పటిక పట్టివేత
సూర్యాపేట: నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం శనివారం చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద పట్టుకుంది. వారి నుంచి నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు ప్రాంతం నుంచి మోతె మండలానికి నల్లబెల్లం, పటిక తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సహాయ కమిషనర్ సంతోష్ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం ఆధ్వర్యంలో చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు టాటా ఇంట్రా మినీ ట్రక్‌లో 17 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 కేజీల పట్టిక తీసుకొస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన విచారించగా.. కూడలి, గోపతండాలకు చెందిన మరో నలుగురి పేర్లు చెప్పారని, వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ జి. వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ పి. గోపాలరావు, హెడ్ కానిస్టేబుల్ అఫ్సర్ అలీ, కానిస్టేబుల్స్ బ్రహ్మం, రమేష్, ప్రశాంత్ పాల్గొన్నారు.


