భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలి
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే నిజాభిషేకంలో పాల్గొనే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకునేలా చూడాలని ఆలయ అధికారులను ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. శనివారం ఆయన కొండ పైన పరిసరాలు, క్యూలైన్లు, కొండ కింద వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణిని ఈఓ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యనారాయణస్వామి వ్రత మండపంలో భక్తులకు ఇచ్చే పూజ సామగ్రి నాణ్యతను పరిశీలించినట్లు తెలిపారు. శని, ఆదివారాల్లో వ్రతాలు చేసుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలని సంబంధింత అధికారులను ఈఓ ఆదేశించారు. లక్ష్మీ పుష్కరిణిలోని నీటిని ఎప్పటికప్పుడు ఫిల్టరింగ్ చేయాలని సంబంధింత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. రాత్రి సమయంలో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అదనంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. కల్యాణ కట్టలో నాయీ బ్రాహ్మణులకు ఎలాంటి డబ్బులు చెల్లించొద్దనే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
యాదగిరిగుట్ట ఈఓ వెంకట్రావ్


