డీసీఎంఎస్‌ ఎత్తివేత! | - | Sakshi
Sakshi News home page

డీసీఎంఎస్‌ ఎత్తివేత!

Nov 8 2025 7:30 AM | Updated on Nov 8 2025 7:30 AM

డీసీఎంఎస్‌ ఎత్తివేత!

డీసీఎంఎస్‌ ఎత్తివేత!

ప్రభుత్వానికి నివేదించాం..

ఎన్‌డీసీఎంఎస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం కోరిన విధంగా ఆస్తులు, ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులతో పాటు అన్ని వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. – నాగిళ్ల మురళి,

డీసీఎంఎస్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌

నల్లగొండ అగ్రికల్చర్‌ : జిల్లా కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) దివాళా తీసింది. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న డీసీఎంఎస్‌ నిర్వహణ కష్టంగా మారడంతో.. దాన్ని వేరే కార్పొరేషన్‌లో విలీనం చేయాలా.. పూర్తిగా రద్దు చేయాలా అనే ఆలోచన చేస్తోంది. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు ధాన్యం కొనుగోళ్లు తదితర సేవలు అందించేందుకు ప్రభుత్వం 1987లో డీఎసీఎంఎస్‌ను ఏర్పాటు చేసింది. కానీ దీనికి.. సరైన బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడంతో అభివృద్ధి చెందలేదు. డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టినా ఎక్కడా విజయవంతం కాలేదు. ఉద్యోగుల కొరత, పాలకవర్గాలు అనాసక్తితో వీటి నిర్వహణ భారంగా మారింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉండడంతో.. వీటిని రద్దు చేసేందుకుగాను ఇప్పటికే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది.

నిలిచిన ఎరువుల అమ్మకాలు

డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో గతంలో యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు, విత్తనాలు అమ్మాకాలు సాగేవి. వాటి ద్వారా వచ్చే కమీషన్‌తో లాభాలు వచ్చేవి. కానీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం యూరియా, ఎరువుల అమ్మకానికి సంబంధించి ట్రాన్స్‌పోర్ట్‌ భారం డీసీఎంఎస్‌ మీదే వేసింది. ఎమ్మార్పీకే విక్రయించాలని నిబంధన పెట్టింది. కానీ, పీఏసీఎస్‌లకు మాత్రం ట్రాన్స్‌పోర్ట్‌ భారం ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలు నిలిచిపోయాయి. రెండేళ్లుగా ఎలాంటి వ్యాపారాలు నిర్వహించకపోడంతో డీసీఎంఎస్‌ దివాళా తీసింది.

ఉమ్మడి జిల్లాలో రూ.100 కోట్లకుపైగా ఆస్తులు..

డీసీఎంఎస్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 3 ఎకరాల భూమి, యాదాద్రి జిల్లా భువనగిరిలో దుకాణాల సముదాయం ఉంది. ఈ ఆస్తుల విక్రయం గతంలో వివాదాస్పదంగా మారి కోర్టుల వరకు వెళ్లింది. నల్లగొండలోని గడియారం సెంటర్‌ సమీపంలో లతీఫ్‌ సాబ్‌ గుట్ట మెట్ల వద్ద విలువైన ఆస్తులతో పాటు నిడమనూరులో 3 ఎకరాలు, యాదాద్రి జిల్లా రామన్నపేటలో గోదాములు ఉన్నాయి. ఈ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆ సొసైటీ నుంచి ప్రభుత్వం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని ఆస్తుల వివరాలు, పని చేస్తున్న ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు, జీత భత్యాలు తదితర వివరాలను ప్రభుత్వం సేకరించింది.

ఫ నిర్వహణ కష్టంగా మారడంతో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి

ఫ కార్పొరేషన్‌లో విలీనం చేయాలా..

పూర్తిగా రద్దు చేయాలా అనే

ఆలోచనలో ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement