పుష్కరిణిలోకి భక్తులను అనుమతించాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలోకి భక్తులకు అనుమతి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ సూచించారు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘స్నాన సంకల్పానికి మంగళం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఈఓ విష్ణు పుష్కరిణిని పరిశీలించారు. పుష్కరిణిలో స్నాన సంకల్పంకు సంబంధించిన ఏర్పాట్లు చేసి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణి ప్రదేశం వద్ద భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్ప పూజలో పాల్గొన్నారు.
అంతరాయం లేకుండా ప్రసాదం అందించాలి
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తులకు నిరంతరం పులిహోర ప్రసాదం ఉచిత పంపిణీ అంతరాయం లేకుండా చూడాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. యాదగిరీశుడి ఆలయ సన్నిధిలోని ఉచిత ప్రసాద వితరణ, పుష్కరిణి, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యూలైన్ మూమెంట్‌కు భక్తులకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులకు, ఎస్‌పీఎఫ్ భద్రత సిబ్బందికి ఇబ్బందులు లేకుండా సూచించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ ఉంటుందని, సోమవారాలు, మాస శివరాత్రి, ఏకాదశి రోజులలో శివాలయం ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదం తయారీ, కౌంటర్స్ పరిశీలించి భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదం తయారు చేయాలన్నారు. కొండపైన దుకాణాలలో దేవస్థానం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, లేకుంటే టెండర్లు రద్దు చేస్తామన్నారు. ఆయన వెంట ఈఈ జె.దయాకర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ డీఈఓ కృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి నవీన్‌కుమార్, మహేష్, శంకర్ నాయక్, ఎస్‌పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు తదితరులున్నారు.
ఫ ‘సాక్షి’ కథనంతో విష్ణు పుష్కరిణిని పరిశీలించిన ఈఓ వెంకట్రావ్


