ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ
మిర్యాలగూడ టౌన్ : ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ, ట్రాక్టర్ ఢీకొనడంతో ట్రాక్టర్ పల్టీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న ధాన్యం చెల్లాచెదురుగా పడింది. ఈ సంఘటన శుక్రవారం మిర్యాలగూడ మండలంలో అవంతీపురం వద్ద చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన పొరెడ్డి అప్పిరెడ్డి ట్రాక్టర్‌లో ధాన్యాన్ని మిర్యాలగూడకు తీసుకువస్తున్నాడు. ఈక్రమంలో మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్ ఎదుటకు రాగానే మిర్యాలగూడ నుంచి మార్కెట్ యార్డు వైపు వెళ్తున్న ధాన్యం లారీ ట్రాక్టర్‌ను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీకొట్టింది. ట్రాక్టర్ ముందు భాగం దెబ్బతినగా రోడ్డుపై ధాన్యం చెల్లాచెదురుగా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. కాగా.. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఫ ట్రాక్టర్ పల్టీకొట్టడంతో
చెల్లాచెదురుగా
పడిన ధాన్యం


