కబడ్డీ జూనియర్ జిల్లా జట్ల ఎంపిక
హాలియా : కబడ్డీ జూనియర్ బాలబాలుర జిల్లా జట్లను బుధవారం అనుముల మండలంలోని మధారిగూడెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో బుధవారం ఎంపిక చేశారు. జిల్లా జట్టుకు 21 మంది బాలురు. 21 మంది బాలికలను ఎంపికయ్యారు. బాలుర జట్టుకు కోచ్‌గా మధారిగూడెం గ్రామానికి చెందిన తూళ్ల ఉదయరాజు, ఆర్గనైజర్‌గా సత్యనారాయణ, బాలికల జట్టుకు కోచ్‌గా ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన షేక్ అన్వర్, ఆర్గనైజర్‌గా ఆవుల చంద్రశేఖర్ వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.భూలోకరావు, కర్తయ్య, సభ్యులు మాచర్ల ఏడుకొండలు, హాలియా, చందంపేట ఎస్‌ఐలు సాయి ప్రశాంత్, లోకేష్ యాదవ్, నిరంజన్, అమీర్ అలీ, ఉదయరాజు, సత్యనారాయణ, అన్వర్, పీఈటీలు సయ్యద్, ఎల్లయ్య, యడవెల్లి రాంబాబు, రమేష్, లెనిన్, తస్లీం, సైదులు, శ్రీను, నరేష్, చంద్రశేఖర్, రవి, లక్ష్మణ్ ఉన్నారు.


