గుర్రంపోడు మోడల్ స్కూల్‌కు ఉత్తమ అవార్డు
హాలియా : గుర్రంపోడు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు పీఎం శ్రీ ఉత్తమ అవార్డు లభించింది. జిల్లాలోని వివిధ కేటగిరీలకు చెందిన 60 పీఎంశ్రీ పాఠశాలల్లో జిల్లా నుంచి గుర్రంపోడు మోడల్ స్కూల్ ఉత్తమ అవార్డుకు ఎంపికై ంది. పీఎం శ్రీ పథకం క్రింద నిర్ధేశించిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా అమలు చేయడం, ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్ధాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం, కిచెన్ గార్డెన్, ఇతర పాఠశాల మౌలిక సదుపాయాలన్నీ సమకూర్చుకోవడం, మెరుగైన ఫలితాలు తదితర ప్రమాణాలన్నీ పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ జి. రాగిణి మంగళవారం అవార్డును పాఠశాల విద్య కమిషనర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో అందుకున్నారు. మోడల్ స్కూలఖు ఉత్తమ అవార్డు రావడంపై ఎంఈఓ నోముల యాదగిరి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


