భూసార పరీక్ష కార్డులను ఉపయోగించుకోవాలి
మిర్యాలగూడ : రైతులు ప్రభుత్వం అందించే భూసార పరీక్ష కార్డులను ఉపయోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్ అన్నారు. మంగళవారం దామరచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతులకు భూసార పరీక్ష కార్డులు అందించి మాట్లాడారు. కార్డులో సూచించిన విధంగా రైతులు ఎరువులను వినియోగిస్తే పంటలో అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏడీఏ సైదానాయక్, ఏవో మేకల రుషేంద్రమణి, ఏఈఓలు సైదులు, పార్వతి, ప్రియాంక, రైతులు నామిరెడ్డి మట్టారెడ్డి, కొడాలి ప్రభాకర్, రాంబాబు, నాగరాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.


