హైవేపై డివైడర్ తొలగింపు
చిట్యాల పట్టణంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై రైల్వే అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారుల ఇక్కట్లను తొలగించేందుకు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాల మేరకు నేషనల్ హైవే మెయింటెనెన్స్ అధికారులు రైల్వే అండర్ పాస్ నుంచి వంద మీటర్ల దూరంలో హైదరాబాద్ వైపు వెళ్లే రహదారి మధ్యలోని డివైడర్‌ను సోమవారం తొలగించారు.
ప్రమాద హెచ్చరిక హోర్డింగ్ ఏర్పాటు
చిట్యాలలో హైవేపై ప్రమాదాల నివారణకు చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని ఓ దాబా హోటల్ ఎదురుగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ హోర్డింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదాలు జరిగే తీరుతోపాటు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఈ హోర్డింగ్ ఏర్పాటు చేయనున్నారు. హోర్డింగ్ నిర్మాణ పనులను సోమవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు.


